calender_icon.png 18 February, 2026 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట

18-02-2026 12:00:00 AM

  1. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
  2. ప్రతిరోజూ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశం.. పాస్‌పోర్ట్ జప్తు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ప్రముఖ పైరసీ సినిమాల వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అతనికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం చేకూర్చారనే ఆరోపణలపై నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, తాజాగా ఉన్నత న్యాయస్థానం అతనికి విముక్తి కల్పించింది.రవికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, హైకోర్టు కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. నిందితు డు రవి ప్రతిరోజూ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరై సంతకం చేయాలని ఆదేశించింది.

కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేప థ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. భద్రత, నిఘాలో భాగంగా అతని పాస్‌పోర్టును తక్షణమే పోలీసులకు అప్పగిం చాలని ఆదేశించింది. ఈ షరతులను అతిక్రమిస్తే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని న్యాయస్థానం హెచ్చరించింది.

అండమాన్ ఐలాండ్ నుంచి హైదరాబాద్ దాకా..

రవి అరెస్ట్ వ్యవహారం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. సినిమాలను పైరసీ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు పోలీసులు గుర్తిం చారు. ఈ సొమ్ముతో అతను దేశం విడిచి పారిపోయి, అండమాన్ దీవుల్లోని ఒక ప్రైవే ట్ ఐలాండ్‌లో విలాసవంతమైన జీవి తం గడుపుతున్నట్లు విచారణలో తేలింది. అయి తే, అరెస్ట్‌కు ముందు రవి పోలీసులకే బహిరంగంగా సవాల్ విసరడం చర్చనీయాం శమైంది. చివరకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైదరాబాద్ పోలీసులు అతడిని నగరంలోనే అదుపులోకి తీసుకున్నారు.