10-02-2026 12:00:00 AM
విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ కథానాయిక. నరేశ్, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘యమాయమ్మ’ విడుదలైంది.
సోమవారం తిరుపతిలో ఈ గీతావిష్కరణ వేడుక జరిగింది. ‘నిజమేనా ఏమైనా నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.., కల్లోనే ఉన్నావా.. నీ ఆశలన్నీ అస్సామైపోవా.., నా చిలకమ్మా రావమ్మా.. ఈ జన్నే నీదమ్మా.., ఓయమ్మా.. ఎంత ప్రేమ.. ఒద్దు మామా.. తెలుసమ్మా నీ డ్రామా.., ఏ హమ్మా.. నువ్వే నా బాపూబొమ్మా.., యమాయమ్మా నువ్వే నా మూను మామా...’ అంటూ సాగుతోందీ గీతం. దేవ్ పవార్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపర్చడమే కాక రోహిణి సోరట్‌తో కలిసి ఆలపించారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి; ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం; కళా దర్శకుడు: జానీ షేక్.