1 March, 2026 | 3:25 AM

హిమాయత్‌నగర్‌లో కలర్స్ హెల్త్ కేర్ 2.0

01-03-2026 01:26 AM

ప్రారంభించిన హీరోయిన్ కేథరీన్ థెరీసా

హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): నగరంలోని హిమాయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న సౌకర్యాలను పరిశీలించిన కేథరీన్ థెరీసా, సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇటీవల ప్రతి ఒక్కరూ లైఫ్‌స్టుల్, ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారన్నారు.

ప్రజలకు అందం, ఆరోగ్యం కలగాలంటే ఇలాంటి ఆధునిక కేంద్రాలు అవసరం. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ ద్వారా నాణ్యమైన సేవలను అత్యాధునిక టెక్నాలజీతో అందించడం అభినందనీయమన్నారు. కలర్స్ హెల్త్‌కేర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది అన్నారు. 22 సంవత్సరాల నుంచి 52 బ్రాంచిలు పూర్తయ్యాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ 2.0గా రూపాంతరం చెందింది అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా హిమాయత్‌నగర్ బ్రాంచిని ప్రారంభించడం సంతోషకరం.హియాయత్‌నగర్ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన కేథరీన్ థెరీసాకు కృతజ్ఞతలు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.