‘రెనోవా’లో ‘బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, సెల్యూలర్ థెరపీ’
హాసిటల్స్‌లో యూనిట్ ప్రారంభం
వైద్య రంగంలో కొత్త మైలురాయి
హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): క్యాన్సర్ చికిత్స రంగంలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన రెనోవా హాస్పిటల్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్12 లోని తన రెనోవా సెంచరీ హాస్పిటల్స్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) అండ్ సెల్యూలర్ థెరపీ’ యూనిట్‌ను శనివారం ఘనంగా ప్రారంభించింది.
ఈ అత్యాధునిక కేంద్రాన్ని ముఖ్య అతిథి, కిమ్స్ హాస్పిటల్స్, సీఈఓ, డాక్టర్ అభినయ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ , సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి, క్లినికల్ లీడ్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ,సెల్యులార్ థెరపీ స్పెషలిస్ట్, డాక్టర్ జి. వాసుబాబు, మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ జి. వాసుబాబు మాట్లాడుతూ తనతో పాటు నిపుణులైన వైద్యులు కలిసి అత్యుత్తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మా నూతన సెంటర్‌లో ఆటోలోగస్, అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్లు (ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్, మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్) సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్ట్ సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సా విధానాలను కూడా అందిస్తున్నామని చెప్పారు.
రెనోవా గ్రూప్ ఫౌండర్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ రెనోవా సెంచరీ హాస్పిటల్స్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అండ్ సెల్యూలర్ థెరపీ’ యూనిట్‌ను ప్రారంభించడం మాకు గర్వకారణం అన్నారు. కేవలం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కే పరిమితం కాకుండా, క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన కార్ట్ సెల్ థెరపీ వంటి అత్యాధునిక సెల్యూలర్ చికిత్సలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నిపుణులైన వైద్యుల బృందం కలిసి అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ అశ్విన్ పండిట్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి. మహేంద్ర వర్మ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ విక్రమ్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ నిషిత్ వడ్డెబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ రామ వాఘ్మారే - కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, రవీంద్రనాథ్ గరగ, సీఓఓ, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ వారిస్, సెంటర్ హెడ్, డాక్టర్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్, మెడికల్ సర్వీసెస్ తో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




