16 June, 2026 | 1:18 AM

19 నుంచి భారీ వర్షాలు

16-06-2026 12:00 AM
  1. విపత్తుల నిర్వహణ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఈ నెల19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షా లు కురుస్తాయని, వాతావరణ శాఖ హెచ్చరికలపై నిరంతర నిఘా ఉంచాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తుగానే అన్ని అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని విపత్తుల నిర్వహణ యంత్రాంగానికి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమ త్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాతా వరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ అధికారులతో సమీక్షించి, ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖతో సమన్వ యం కొనసాగించాలని స్పష్టం చేశారు.