ఎన్టీఏ నిర్వాకం!
- ఫీజు రీఫండ్ గందరగోళం
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్య
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరు ఏమా త్రం మారడంలేదు. వరుస తప్పిదాలతో విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. దేశ వ్యా ప్తంగా జూన్ 21న మళ్లీ నీట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్‌లో పెట్టినట్లు ఈ నెల 14న ఎన్టీఏ ప్రకటిం చింది. అయితే, ఈ డౌన్‌లోడ్ లింక్ సైతం ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. దాదాపు 23 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయా ల్సి ఉండగా.. అడ్మిట్ కార్డుల జారీ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం వర కు కేవలం 4లక్షల మంది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏనే ప్రకటించింది. సాంకేతిక, సర్వర్ ఇబ్బందుల కారణమని తెలిపింది.
బ్యాంకు వివరాలతో లింకు
రీఎగ్జామ్ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకు నే ముందే రీఫండ్‌కు సంబంధించి బ్యాంకు వివరాలను ధ్రువీకరించుకోవడం తప్పనిసరి చేయడం మరింత గందరగోళానికి దారితీసిం ది. అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసే క్రమం లో ఫీజు రీఫండ్ ఆప్షన్ మరోసారి చెక్ చేసుకోవాలని మెసేజ్ వస్తోందని, బ్యాంకు వివరా ల నమోదు చేసేందుకు వెళ్తే తమ పాత వివరాలు కనిపించడంలేదని పలువురు విద్యార్థు లు వాపోతున్నారు. ‘మీకు రీఫండ్ అవసరం లేకపోతే ముందుకెళ్లండి’ అనే మెసేజ్ కనబడటంతో డబ్బులు రీఫండ్ చేయకుండా ఉండేం దుకు ఎన్టీఏ ఎత్తుగడలు వేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. బ్యాంకు వివరాలను వెరిఫై చేసుకున్నా.. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కావడం లేదని మరికొందరు విద్యార్థులు వాపోతున్నారు.
మరో భధ్రతా వైఫల్యం
నీట్ పోర్టల్లో మరో వైఫల్యం వెలుగులోకి వచ్చింది. నీట్ పోర్టల్లోని భద్రతా లోపాలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకొని బిహార్‌లోని గయాకు చెందిన నవీన్ యాదవ్(19) నీట్-యూజీ అభ్యర్థుల ఖాతాలలోకి అనధికారికం గా ప్రవేశించాడు. 350 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు సు మారు 150 ఖాతాలను విజయవంతంగా యాక్సెస్ చేశాడు. వీటిని యాక్సెస్ చేయడానికి పాస్‌వర్డులు, ఎన్‌క్రిప్షన్ కీలు, పిన్లను ఛేదించడానికి ఉపయోగించే ట్రయల్- పద్ధతి అయిన బ్రూట్ ఉపయోగించి ఖాతాలలోకి చొరబడ్డాడు. అనంతరం విద్యార్థుల ప్రొఫైల్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు తొలగించి తన ఖాతా వివరాలతో అప్డేట్ చేశాడు. దీంతో ఒక్కో విద్యార్థికి అందాల్సిన రూ.1,700 అతడి ఖాతాలో జమ అయ్యాయి. ఖాతా వివరాల ఆధారంగా నిందితుడిని అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నీట్ పోర్టల్ భద్రతా ఫీచర్లను ఎన్టీఏ పటిష్టం చేసింది.






