16 June, 2026 | 1:20 AM

అకాడల అభివృద్ధికి కృషి చేయాలి

16-06-2026 12:00 AM
  1. హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్
  2. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు వినతిపత్రం అందజేత

హైదరాబాద్, జూన్ 16(విజయక్రాంతి): నగరంలో ఉన్న 98 అకాడ వ్యాయామశాలలో, పైల్వాన్‌లకు సామాగ్రి, సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాడల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని, హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, నగర అధ్యక్షులు సంతోష్ పైల్వాన్‌లు, పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో, శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి, అకాడ వ్యాయా మశాలలో పైల్వాన్‌లకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు, వాటి పరిష్కారం కోసం తమ వంతు చొరవ చూపాలంటే వినతిపత్రం అందజేశారు.

అనంతరం గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అకాడ వ్యాంశాలలో సరైన సౌకర్యాలు లేక, యువత, చెడు మార్గా ల్లో, వెళ్తున్న , వారిని సన్మార్గంలో పెట్టాలంటే వారి చూపు , వ్యాంశాల వైపు మళ్లించాలని,, ఆ ఆదిశగా తమ హైదరాబాద్ రెల్లింగ్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

అకాడలో అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే, పైల్వాన్లు తయారై, రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తారని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించి, తన సొంత డబ్బులతో హామీ ఇచ్చినట్లు గడ్డంశ్రీనివాస్ యాదవ్ తెలిపారు, ఈ కార్యక్రమంలో, సంతోష్ పైల్వాన్, గొంటి శ్రీనివాస్ యాదవ్, అస్లాం, నజీర్, సల్ల ఆనంద్, అభిబ్, లింగం, సురేష్ యాదవ్, పలువురు పైల్వాన్లు పాల్గొన్నారు.