24 August, 2026 | 2:13 AM

మరో మూడు రోజులు భారీ వర్షాలు

24-08-2026 01:21 AM

రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి వానలు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి): రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వా తావరణ శాఖ సూచించింది. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.   

అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

శనివారం అర్ధరాత్రి దాటేవరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబా ద్, రాజన్న సిరిసిల్లా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్, సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, హ నుమకొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నల్లగొం డ, మెదక్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లిలో మోస్తారు, మిగిలిన జి ల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురిశాయి.