24 August, 2026 | 5:00 AM

భారీ వర్షం.. జలమయమైన రహదారి

24-08-2026 12:56 AM
  1. అధికారుల నిర్లక్ష్యంతో కల్వర్టులు కబ్జా, అక్రమ నిర్మాణాలు..
  2. భారీగా నిలిచిన వర్షపు నీరు..
  3. వర్షం పడితే ఇదే పరిస్థితి పునరుత్తమవుతుందని స్థానిక ప్రజలు ఆరోపణ

మొయినాబాద్ ఆగస్టు 23(విజయ క్రాంతి): మొయినాబాద్ మండల మున్సిపాలిటీ పరిధిలోని కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలోని హిమాయత్ నగర్ చౌరస్తా ఉడిపి హోటల్ ముందు వరద నీరు భారీగా రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించి కొంతసేపు స్తంభించిన పరిస్థితి నెలకొంది.

హిమాయత్ నగర్ రెవెన్యూలోని వర్షపు నీటి కల్వర్టులు, కాలువలు పూర్తిగా ఆక్రమణలకు గురికావడం, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాల కారణంగానే వర్షపు నీరు సక్రమంగా వెళ్ళలేక రోడ్లపై నిలిచిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో డ్రైనేజీలు, కాలువలను శుభ్రపరచడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారని ప్రజలు విమర్శిస్తున్నారు. వర్షం పడితే ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పకీ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి కాలువల ఆక్రమణలను తొలగించి. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.