25 March, 2026 | 12:15 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు

25-03-2026 10:59 AM

హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల(petrol bunks) వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. కూకట్ పల్లి, ప్రగతినగర్, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, షేక్ పెట్ తో పాటు పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మ వద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం వల్ల  పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే వదంతులు వైరల్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు తగిలించారు.