ఆరోగ్యం బాగుంది.. త్వరలో కలుస్తా..
13-08-2026 12:16 AM
ఆపరేషన్ అనంతరం అభిమానులను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ట్వీట్
సికింద్రాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గా యం కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి లో ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కిమ్స్ వైద్యులు ఎన్టీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం బాగుంది. నాపై చూపిస్తున్న ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞత లు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్. కుటుంబం, స్నేహితులు, అభిమానుల మద్దతే తనకు ప్రతిరోజూ బలాన్నిస్తోందన.త్వరలో మిమ్మల్ని కలుస్తాను అంటూ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు.






