6 July, 2026 | 9:00 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   కొబ్బరితోట నరికివేత... పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా   •  

సెంచరీకి చేరువలో హెడ్

06-01-2026 12:00 AM
  1. ధీటుగా జవాబిస్తున్న ఆసీస్

ఇంగ్లాండ్ 384, ఆసీస్ 166/2

సిడ్నీ, జనవరి 5 : యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా ధీటుగా బ దులిస్తోంది. హెడ్ దూకుడయిన బ్యాటింగ్‌తో రెండోరోజు ఆసీస్‌దే పైచేయిదా నిలి చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ 160 పరుగులతో అదరగొడితే..హ్యారీ బ్రూక్ 84, జేమీ స్మిత్ 46, విల్ జాక్స్ 27 పరుగులతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభిం చిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ట్రావిస్ హెడ్, వెదరాల్డ్ తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. వెదరాల్డ్ (21) ఔటైనప్పటకీ లబూషేన్‌తో కలిసి ట్రావిడ్ హెడ్ దుమ్మురేపాడు.

87 బంతుల్లోనే 91 (15 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లబూషేన్, హెడ్ రెం డో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. లబూషేన్ 48 (7 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా రెండోరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. హెడ్ 91, మైకెల్ నెసర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 218 పరుగులు వెనుకబడి ఉంది. కాగా యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3 ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా మూ డు టెస్టుల్లో ఆసీస్ గెలిస్తే, బాక్సింగ్ డే టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.