డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి
ఉప్పల్,విజయక్రాంతి: మల్లాపూర్ డివిజన్లోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ను స్థానికుల కాకుండా బయటి వాళ్లకు కేటాయించారంటూ దీనిపై సమగ్ర విచారణ జరిపి స్థానికులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ప్రజావాణిలో అధికారులు ఫిర్యాదు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ డివిజన్ లోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానికంగా నివసించే వారు కాకుండా బయటి వారికి ఇల్లును కేటాయించారు.
దాదాపు 50% బయటి వారే డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే నిరుపేద కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్థానికులు ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపించి స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ స్థానికులు నాయకులు పాల్గొన్నారు






