20 April, 2026 | 2:19 AM

సఫారీ మహిళలదే రెండో టీ20

20-04-2026 12:44 AM

తేలిపోయిన భారత బౌలర్లు

సౌతాఫ్రికాకు  2 ఆధిక్యం

డర్బన్, ఏప్రిల్ 19: సఫారీ టూర్‌లో భారత మహిళల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి టీట్వంటీలో ఓడిన భారత్‌కు రెండో మ్యాచ్ లో నూ చుక్కెదురైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సౌతాఫ్రికా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజ యం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 147 పరుగులకే ఆలౌటైంది.

తర్వాత ఛేజింగ్ లో ఓపెనర్లు వోల్వార్డ్, సునే లూస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 12 ఓవర్లలోనే 106 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటై నా బ్రిట్స్ (20), డెర్క్ సన్ (12) సౌతాఫ్రికా విజయాన్ని పూర్తి చేశారు.  ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.