30 August, 2026 | 4:30 PM

లంబాడీల జోలికొస్తే ఖబడ్దార్‌

30-08-2026 03:18 PM

* గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలా?

* లంబాడీ ఉద్యోగులను అవమానిస్తే సహించేది లేదు

* ఉద్యోగుల హక్కులు, గౌరవం కోసం పోరాడతాం

* మల్లయ్య యాదవ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఎల్‌హెచ్‌పీఎస్‌

కోదాడ ఆగస్టు 30(విజయ క్రాంతి): గిరిజన లంబాడీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్‌) నాయకులు మండిపడ్డారు. లంబాడీ ఉద్యోగుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజన లంబాడీ ఉద్యోగులను అన్ని విధాలుగా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

లంబాడీలను అవమానించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తగిన రీతిలో సమాధానం చెబుతామని ఎల్‌హెచ్‌పీఎస్‌ మాలోత్ సైదా నాయక్, ఏడవ వార్డు కౌన్సిలర్ చైతన్య నాయక్ , రవి నాయక్ , రాజు నాయక్, హాజీ నైట్ క్, పద్మాబాయి, నిఖిల్ నాయక్ , దుర్గాబాయి, నాగేందర్, పాపా నాయక్ , శీను నాయక్ , పరశురాం నాయక్ తదితర నాయకులు స్పష్టం చేశారు.