30 August, 2026 | 4:54 PM

న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఛలో హైదరాబాద్

30-08-2026 03:33 PM

సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా

ఉపాధ్యాయులు భారీగా తరలిరావాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని PRTU TS  జిల్లా ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల నుంచి అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని, DSC–2003 ఉపాధ్యాయులకు OPS అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న PRCను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.సెప్టెంబర్ 1న నిర్వహించే మహాధర్నాకు ఉపాధ్యాయులు నీలిరంగు టీషర్టులు, చీరలు లేదా చుడిదార్లు ధరించి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాల, ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులు ఒక్కతాటిపైకి వచ్చి హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు.