20 June, 2026 | 6:07 PM

హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు వద్దంటూ సిఐటియు నిరసన

20-06-2026 05:29 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఫైనాన్స్ డిస్టిక్ నానక్ రామ్ గూడ లోని అమెరికా కాన్సులేట్ వద్ద రోడ్డు కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కెనాల్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం అకారణమైన యుద్ధ లను సృష్టించి అనేక లక్షల మంది ప్రాణమానాలను హరించి వేస్తూ, ఆంక్షలు పేరుతో భారతదేశంపై అనేక ఆర్థిక భారాల మోపతూ దానితో దేశంలోని పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం అనేక అవస్థలకు కారణమవుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును మన రాష్ట్ర రాజధాని లో ఒక రోడ్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడాన్ని సిఐటియు వ్యతిరేకిస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు.

నియంతృత్వానికి, అప్రజా స్వామికానికి ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి  అమెరికా సామ్రాజ్యవాదం అధ్యక్షుణ్ణి పొగడడం వారి పేరును ఇక్కడ పెట్టడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన వైఖరిలో మార్పు వచ్చిందని భావించవలసి వస్తుందని అన్నారు, డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న దుర్మార్గాలకు అమెరికా దేశం లోనే వ్యతిరేకత వస్తుందని, కానీ ట్రంప్ కు  నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయ పడడంతో ఈరోజు దేశంలో అనేక భారాలు దేశ ప్రజలు మోస్తున్నారని అట్లాంటి దుర్మార్గుడి ప్రజా వ్యతిరేకి ఆయన ట్రంప్ పేరును పెడితే ఈ ప్రభుత్వంపై కూడా ప్రజల తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు.