బెల్ట్ షాప్ లలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం.
20-06-2026 05:23 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానించి శనివారం ర్యాలీ నిర్వహించారు. తాళ్ల వెల్లంల గ్రామంలో మద్యం అమ్మకాలను ఈనెల 21 నుంచి నిషేధిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ శాంతి భద్రతలు, యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకొని గ్రామంలోని బెల్ట్ షాపులలో మద్యం నిషేధించడానికి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానం చేసి, ర్యాలీ నిర్వహించామని సర్పంచ్ జోగు సురేష్ తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు మహిళలు యువత పాల్గొన్నారు.






