కరీంనగర్ అభివృద్ధికి టెక్నాలజీ తోడు
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలను పెంచే దిశగా నగర పాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంది ఇందులో భాగంగా 35వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అత్యాధునిక AJAX సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వినియోగిస్తూ నగర మేయర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయం.
అందుకే ఆధునిక యంత్ర సాంకేతికతను వినియోగిస్తూ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం అని తెలిపారు. కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అందుకు అనుగుణంగా మన పని విధానాలు కూడా మారాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు అందించడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ సాధవేని సుజాత శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






