13 August, 2026 | 4:45 AM

డిజిటల్ అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

13-08-2026 02:03 AM

టౌన్ సీఐ సీతారాం

షాద్‌నగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): డిజిటల్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతోనే సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని షాద్నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నా చిల్క మర్రి గ్రామంలోని ఏం ఎస్ ఎన్ సంస్థ ప్రాం గణంలో ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రెండో వారపు సైబర్ నేరాల అవగాహన కల్పించారు. ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ ని నాదంతో డిజిటల్ భద్రత, ఆర్థిక మోసాల ని వారణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సైబర్ నిపుణులు, పోలీస్ అధి కారులు మాట్లాడుతూ ఉద్యోగులను లక్ష్యం గా చేసుకుని జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలపై వివరించారు. నకిలీ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్లు, అధిక లాభాల పేరుతో మోసపూరిత స్కీములు, అనధికార డిజిటల్ లోన్ యాప్లు, ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకింగ్, వ్యక్తిగత ఖాతాల భద్రత కోసం బలమైన పాస్వర్డ్లు వినియోగించాలని, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) తప్ప నిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని తెలిపారు.

పబ్లిక్ వై-ఫై ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దని, అనుమానాస్పద ఎస్‌ఎంఎస్ లు, వాట్సాప్ లింకులను క్లిక్ చేయకూడదని సూచించారు.  సైబర్ మోసానికి గురైనప్పు డు ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవ ర్‌లో స్పందించడం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు. బాధితులు వెంటనే 1930 జాతీ య సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime. gov.in లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.