11 August, 2026 | 3:28 AM

ఏఐటీయూసీ ‘జైల్ భరో’ కేంద్రం విధానాలపై నిరసన

11-08-2026 12:36 AM

కందుకూరు, అగస్టు 10 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కందుకూరు మండల కేం ద్రంలో ఏఐటీయూసీ  ఆధ్వర్యంలో ‘జైల్ భ రో’, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికులకు నెలకు రూ.26వేల కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపో తే రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో నాయకులు దేవేంద్ర గౌడ్, యాదగి రి, రవి, పప్పు శాంసంగ్, నరసింహ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.