28 August, 2026 | 12:57 AM

ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ

27-08-2026 06:22 PM

షైన్ పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్

పాఠశాలలో ఘనంగా ముందస్తు రాఖీ వేడుకలు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని రాఖీ పండుగ అని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక షైన్ పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ అన్నారు. గురువారం పాఠశాలలో ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యలో ఉంటే ప్రేమ, అనుబంధం, రాఖీ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పండుగల ద్వారా చిన్నతనం నుండే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి అవగాహన పెంపొందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా కరెస్పాండెంట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.