12 May, 2026 | 8:16 PM

సుల్తానాబాద్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

12-05-2026 06:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో స్వాములు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రి నగర్ లో మాజీ మార్కెట్ చైర్మన్, మాజీ సర్పంచ్ సాయిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు అన్నదానం చేశారు. అలాగే పట్టణంలోని పలు దేవాలయాలో ప్రత్యేక పూజలు, అన్నదానాలు  జరిగాయి, సుల్తానాబాద్ మండలంలోని గ్రామాల్లోను హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.