14 August, 2026 | 9:50 PM

సరస్వతి నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

14-08-2026 08:34 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2వ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్‌లో రూ.27.90 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు నాణ్యతతో కూడిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.