3 April, 2026 | 3:11 AM

ఘనంగా హనుమాన్ జయంతి

03-04-2026 01:26 AM

మొయినాబాద్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు.వేడుకల్లో భాగంగా చిలుకూరు బాలాజీ దేవాలయం నుండి మొయినాబాద్ శివాలయం వరకు భవ్యమైన హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.

ఈ శోభాయాత్రలో యువకులు బైక్ ర్యాలీగా పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమంతా భక్తి గీతాలు, డప్పుల నినాదాలతో ప్రాంతం మార్మోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం హాజరై శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పండుగ ఆధ్యాత్మికత, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సన్నివేలి ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్, చందు రెడ్డి, రమేష్ చారి, నరేష్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, విజయ్ పాండు యాదవ్, రాకేష్, బజరంగ్దళ్ మల్లేష్ యాదవ్, విజయ్ గౌడ్, భవన్ గుప్తా, రఘురాం రెడ్డి, శ్రీయాన్ష్ గౌడ్, అరన్స్ దేవ్,స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు.