హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు
హన్మకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నుంచి గడ్డం కేశవమూర్తి,టీయూడబ్ల్యూజే 143 నుంచి బీఆర్.లెనిన్, టీజేఏ నుంచి వల్లాల జగన్ ను నియమించారు. అలాగే బిగ్ మీడియా నుంచి కంకణాల సంతోష్, ఉర్దూ డేలీ నుంచి నయిమ్, మీడియం డేలీ నుంచి ఎన్.బుచ్చిరెడ్డి, చిన్న పత్రికల నుంచి జి. మధు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎం .సుధాకర్, ఫొటో జర్నలిస్టు నుంచి గోకారపు శ్యాం, వీడియో జర్నలిస్టు నుంచి బోళ్ల అమర్ ను నియమించారు. వీరితో డీపీఆర్ఓ, ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.
కృతజ్ఞతలు
కమిటీ సభ్యుడిగా సీనియర్ ఫొటో జర్నలిస్టు గోకారపు శ్యాం కుమార్ కు చోటు లభించగా ఆయన తనకు అవకాశం రావడానికి సహకరించిన టీయూడ బ్ల్యూజే(హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణకు, రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్ కి, రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షు డు భాస్కర్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో జర్నలిస్టు నుంచి బోళ్ల అమర్ ను ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. తన ఎంపిక కు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.






