17 April, 2026 | 1:28 PM

నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. సీపీఐ నాయకుల డిమాండ్

17-04-2026 12:19 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ఆక్రమణల పేరుతో  వ్యాపారస్తులకు పంచాయితీ కార్యదర్శి నోటీస్ లు ఇవ్వటం పై గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగే విధంగా పార్టీ తరఫున పనిచేస్తామని సీపీఐ మండల కార్యదర్శి ఎండీ యూసుఫ్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు,సీపీఐ నాయకులు ఎస్.కె  జబ్బార్ హామీ ఇచ్చారు. జగన్నాధపురంలో ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారనే నెపంతో పంచాయతీ కార్యదర్శి జారీచేసిన నోటీసులు అందుకున్న బాధితులతో గురువారం వారు మాట్లాడారు.పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి ప్రభుత్వ ఆధీనంలో గల ఫారెస్ట్ ల్యాండ్, చెట్టు ముట్టుకోవాలన్న నష్ట పరిహారం చెల్లించాకే పనులు నిర్వహిస్తారని అలాంటిది జగన్నాధపురానికి ఎటువంటి రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం పనులు, నిధులు మంజూరు చేయకపోయినప్పటికీ కక్షపూరితంగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న గ్రామస్తులకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం సరైన చర్య కాదన్నారు.గ్రీన్ ఫ్లీల్డ్ హైవే రోడ్ విస్తరణలో భూములు,ఇండ్లు కోల్పోయిన రైతులకు 20 లక్షల పరిహారం ఇచ్చారని.జగన్నాధపురంలో ఆర్ అండ్ బి రోడ్ విస్తరణ చేపడితే బాధితులకు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందజేయాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు.

ములకలపల్లి మండల కేంద్రంలో నిధులు మంజూరు చేసి చేపట్టిన సెంట్రల్ లైటంగ్ పనులకు ములకలపల్లి మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు ,పార్టీలు 50 అడుగులు రోడ్ విస్తరణ చెయ్యాలని ఆర్ అండ్ బి అధికారులను అడిగితే 40 అడుగులు మాత్రమే రోడ్ వైడనింగ్ చేసిన అధికారులు మండల కేంద్రం కానీ జగన్నాధపురంలో 50 అడుగులు కావాలని పట్టు బట్టటంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు.ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకుండా అధికారులు,ప్రజా ప్రతినిధులు వ్యవహరించాలని వారు సూచించారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఎస్కె ఇబ్రహీంను వివరణ కోరగా గ్రామ పంచాయతీ ఇచ్చిన లెటర్ మేరకు ఆర్ అండ్ బి అధికారుల సూచనలు,నిబంధనల మేరకు రోడ్డును ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులు ఇవ్వడం అనేది తన వ్యక్తిగత విషయం కాదన్నారు.