calender_icon.png 1 April, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ ఘన విజయం

30-03-2025 12:04:57 AM

36 పరుగులతో ముంబై ఇండియన్స్ ఓటమి

అహ్మదాబాద్, మార్చి 29: ఐపీఎల్ 18వ సీన్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. శనివారం సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటా న్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ (63) అర్థసెం చరీ సాధించాడు. ముంబై బౌలర్లలో పాం డ్యా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యా టింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సూర్యకుమార్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.