థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
కరీంనగర్ లో బీజేపీ ఎస్టీ మోర్చా సంబురాలు
ముకరంపుర,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 13 వేల మంది గిరిజనులతో నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల కరీంనగర్ జిల్లా ఎస్టీ మోర్చా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ వేదికపై వెలుగులు విరజిమ్మడం దేశానికి గర్వకారణమని, ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో గిరిజన కళలకు ఈ గుర్తింపు దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ , కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్ , పెద్దపల్లి జితేందర్, ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు శ్రీకాంత్ నాయక్, , ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్ట రాజు, మరియు ఎస్టి మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ శ్రీనివాస్ నాయక్ , బిజెపి పార్టీ ఎస్టి మోర్చా నాయకులు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






