27 March, 2026 | 11:32 PM

జీఎస్టీ 2.o ధమాకా

19-10-2025 12:45 AM

-దేశవ్యాప్తంగా బచత్ ఉత్సవ్

-జీఎస్టీ సంస్కరణలతో సత్ఫలితాలు

-ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాల్లో కొనుగోళ్ల జోష్

-కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

-‘ధన్తేరాస్’ ఉత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మీడియా సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: జీఎస్టీపై గత నెల 22న ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ‘2.o’ సంస్కరణలతో దేశవ్యాప్తంగా వినియోగదారుల కొనుగోలుశక్తి పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలు ఊహించిన దానికంటే పన్నులు తగ్గడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బచత్ ఉత్స వం నడుస్తుందని, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుందని పేర్కొనారు. ధన్తేరాస్ ఉత్సవం సందర్భంగా శనివారం కేంద్రమంత్రులు పియూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమవేశంలో ఆమె మాట్లాడారు.

ప్రజలు అంచనా వేసిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారని వివరించారు. దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేశారని వెల్లడించారు. జీఎస్టీ డబుల్ ధమాకాతో ప్రధాని మోదీ దేశప్రజల ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువచ్చారని కొనియాడారు. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగా ల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చాయని తెలిపారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందని, ఆయా రంగాల్లో అనూహ్యమైన కొను గోళ్లు జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే సాధారణ అవసరాలైన సబ్బులు, షాంపూలతో పాటు ద్విచక్రవాహనాలు, కార్ల విక్ర యాలు జోరందుకున్నాయని తెలిపారు. తాజాగా కొనుగోళ్ల ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ అడుగు పెడుతుందని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా టెలివిజ న్, ఏసీల అమ్మకాలు గతంలో కంటే 30 శాతం పెరిగాయని వివరించారు. కేంద్ర మం త్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణ సమయంలో దేశంలో వినియోగం, డిమాండ్ ఎలా పెరుగుతుందనే దాని గురించి అనేక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.

ఈ సంస్కరణల కారణంగా దేశంలో వినియోగం పెరుగుతోందని, ఈ ఏడాది సుమారు రూ.20 లక్షల కోట్ల అదనపు వినియోగం జరిగే అవకాశం ఉందని అన్నారు. అమెరికాకు స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయడంలో భారత్ తన పొరుగు దేశాన్ని అధిగమించిందని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది దేశం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. ప్రపం చ వ్యాప్తంగా తయారయ్యే స్మార్ట్‌ఫోన్ల తయారీలో 20శాతం తయారీ ఒక్క భారత్‌లోనే జరుగుతుందని వివరించారు.