టీజీబీ భవనానికి శంకుస్థాపన
- ఉప్పల్ భగాయత్‌లో చైర్మన్ సీఎస్ శెట్టి భూమిపూజ
- వరంగల్‌లో సీఎస్‌ఆర్ కార్యక్రమాలు
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నూతన ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు వరంగల్‌క్ష భారీ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాలను ప్రారంభిం చారు.
ఉప్పల్ భగాయత్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వి ని కుమార్ తివారీ, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం ఉదయ్ భాస్కర్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్) రాయీ రవి పాల్గొన్నారు. వరంగల్‌లో సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా, వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద చైర్మన్ కీలక సీఎస్‌ఆర్ గ్రాంట్లను ప్రకటించారు.
గ్రామీణ ప్రాథ మిక పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ’సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్’కు రూ.75 లక్షలు, వృద్ధుల భద్రత, సౌకర్యాల కల్పన కోసం సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్’ పునరుద్ధరణకు రూ.17.5 లక్షలు అందజేశారు. సిఎస్ శెట్టి మాట్లాడుతూ ఎస్బిఐ కేవలం ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా, సమాజంలో దీర్ఘకాలిక మార్పును తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడం, మహిళల్లో నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించడం మా ప్రధాన లక్ష్యాలు, అని తెలిపారు.




