4 May, 2026 | 9:17 PM

రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ నిర్వహణ

04-05-2026 08:05 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, శాశ్వత సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సిద్ధాంతి శ్రీమాన్ సంపత్ కుమార్ ఆచార్యులు పర్యవేక్షించారు. రాజగోపుర నిర్మాణానికి తమ వంతు విరాళంగా రూ.21 లక్షలు అందజేసిన టిఎండీ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ టిఎండీ లక్ష్మణ్ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాజగోపుర నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు స్వామివారి కరుణాకటాక్షాలు లభిస్తాయని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందన్నారు.