24 March, 2026 | 4:42 PM

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

24-03-2026 03:00 PM

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతామని మండలంలోని బంబార గ్రామ సర్పంచ్ కృష్ణాజి అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ పరిధిలోని గోండు కొసార గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.3 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నులే నారాయణతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీలో మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడే సంతోష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గురునులే మెంగజి, డికొండ మహేష్, కర్పెత రామచందర్, సెల్వాట్ కార్ పెట్టు, వాడై దుర్గాజీ, మెంగు పటేల్, గోపాల్ సోయం, దౌలత్ రావ్, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.