24 March, 2026 | 4:41 PM

ఈనెల 26న పశువుల వార సంత వేలం

24-03-2026 03:03 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు పశువుల వారసంత వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి విద్య శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ఎలాంటి ఇంటి బకాయిలు ఉండకూడదన్నారు. సోనాపూర్ గ్రామ పంచాయతీ ఏజెన్సీకి చెందిన నేపథ్యంలో వేలంలో కేవలం గిరిజనులు మాత్రమే పాల్గొనాలని పేర్కొన్నారు. వేల అనంతరం కాంట్రాక్టు పొందిన వారు వేలం మొత్తంలో సగం రుసుము చెల్లించాలని, మిగిలినవి వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు పంచాయతీ కార్యాలయంలో డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.