24 March, 2026 | 4:43 PM

ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దాం

24-03-2026 02:57 PM

సర్పంచ్ సునీత

వాంకిడి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ్య స్వాములు కావాలని ఖమాన గ్రామ సర్పంచ్ సునీత అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఖమాన పంచాయతీ పరిధిలోని పోచమ్మ టెంపుల్ కాలనీ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకు వద్ద ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బందితో కలిసి నీటి సరఫరా పైపులన్ మరమ్మత్తు, పరిసరాల పరిశుభ్రత పనులను చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి - పొడి చెత్తను వేరుగా చేసి చెత్త డబ్బాలో వేయాలి అన్నారు. అలాగే మొక్కలను నాటి వాటిని సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.