27 April, 2026 | 9:09 PM

నగరంలో పలు పనులకు శ్రీకారం

27-04-2026 04:48 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా సోమవారం రోజు 23 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ నగరపాలక సంస్థకు చెందిన 49.90 లక్షల సాధారణ నిధులతో సీతా రాంపూర్ ప్రాంతంలోని పలు కాలనీల్లో 300 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పనులకు స్థానిక కార్పోరేటర్ గుమ్మడి రాజ్ కుమార్ తో కలిసి భూమీ పూజ చేసి పనులు ప్రారంబించారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ... నగరాభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్‌ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తున్నామని తెలిపారు.

ముఖ్యంగా  గతంలో మరియు ఇటీవల నగరపాలక సంస్థ లో విలీన గ్రామాల డివిజన్ల కు కూడ నిధులను కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.  గతంలో  మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారం తో కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ 2.0 పథకం ద్వారా 147 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని ఈ నిధుల తొ విలీన గ్రామాల డివిజన్ లలో మంచినీటి సరఫరా పైపు లైన్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఓంటెల సత్యనారాయణ, భారీ అపర్ణ జితేందర్,  అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.