ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
ఆదివాసీ, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం
సీఎం రేవంత్‌రెడ్డి
ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం
లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు
రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి పేద కుటుం బానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కొలాం కొఠారి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సోమవారం సీఎం ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన గూడేల్లో ఒక్క గుడి సె కూడా ఉండకుండా, ఇండ్లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఆదివాసీ, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా, ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల కోసం అదనంగా 21 వేల ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇల్లు అందేలా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.
కొత్తగూడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్న సీఎం, ఇప్పటికే లక్షకు పైగా ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించామని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇల్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు స్వయం సహాయక సం ఘాల మహిళలకు రుణ పరిమితిని పెంచినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలో పేతం చేసే దిశగా వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సంద ర్భంగా జిల్లాలో రూ.112.14 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కౌటాలా,లో రూ.56.55 కోట్లతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు.
చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రెబ్బెన మండలం నంబాల లో 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఆదివాసీ, గిరిజన పిల్లలు విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతి కుటుంబం పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు






