ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
జార్ఖండ్ రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ అధినేతకు నివేదిక
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి సోమవారం ఢిల్లీకి వెళ్లి ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను వేర్వేరుగా కలిశారు.
జార్ఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ వ్యవహా రాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్ని కల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హే మంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల వివరాలను ఏఐసీసీ అధినేతకు వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ’ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు.
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపిన సంప్రదింపులను భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును ఆయన ఏఐసీసీ అధ్యక్షునికి వివరించారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటన వివ రాలు, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను అందజేశారు.






