17 March, 2026 | 3:34 AM

చిన్న స్వామిలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్

17-03-2026 12:46 AM

బెంగళూరు, మార్చి 15: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ చా లెంజర్స్ బెంగళూరుకు ఊరట లభించింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్టేడియంలోని భద్రత, సంసిద్ధత చర్యలను పరిశీలించి క్లీన్ చీట్ ఇచ్చింది. దాంతో కర్ణాటక ప్రభు త్వం మ్యాచ్‌లను నిర్వహించేందుకు అనుమతిచ్చింది.

సోమవారం విధాన సౌధలో హోంమంత్రి జీ పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీ సుకుంది. దాంతో ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ.. చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లు ఆడనుంది. తన రెండో హోమ్ గ్రౌండ్‌గా రాయ్ పూర్ స్టేడియాన్ని ఎంచుకున్న ఆర్సీబీ.. అక్క డ రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్, ఫైనల్ కూడా బెం గళూరులో నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు 3, 4 గంటల ముందే స్టేడియం గేట్లను తెరవనున్నారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు.