సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం
- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
- గాంధీభవన్‌లో సీఎం 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వేడుకలు
హైదరాబాద్, జూలై 4(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్‌లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నాయకులు, కార్యకర్తల తో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ తన లక్ష్యా న్ని వీడకుండా ప్రజా సేవనే ధ్యేయంగా ముం దుకు సాగారని కొనియాడారు.
కష్టపడి పనిచేస్తే ప్రజల ఆశీర్వాదంతో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చనే విషయాన్ని ఆయన రాజకీయ ప్రయాణం నిరూపించిందన్నారు.రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం నేటి యువ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, తాము కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్య ల పరిష్కారం, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నామని మెట్టు సాయికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.






