10 March, 2026 | 3:32 AM

అడ్డాకుల మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

09-03-2026 01:27 AM

అడ్డాకుల మార్చి 8 : తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజా పాలన ప్రభుత్వం రైతులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం  నూతన ఏర్పాటుకు అడ్డాకుల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 161 లో విస్తరణ ఆరు ఎకరాలు 20 గుంటలు అడ్డాకుల మండల కేంద్రంలో స్థలం కేటాయించినట్లు ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టిలో తీసుకువెళ్లడం సానుకూలంగా స్పందించారన్నారు.

ఇట్టి విషయం పై ఆదివారం అడ్డాకుల మండల కేంద్రంలో విజయ మోహన్ రెడ్డి ఇంటిదగ్గర కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ 99 రోజులు ప్రణాళిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పల్లెలు మరియు పట్టణాలు రూపురేఖలను మార్చడానికి ప్రజలకు చేరువ కావడానికి తీసుకొస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రతిష్టాత్మక నిర్ణయం అభివృద్ధి చెందుతుందని అందుకోసం దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో అడ్డాకుల మూసాపేట మండలాలకు మార్కెట్ యాడ్ ను అతి త్వరలో ప్రారంభిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల పట్ల మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 10 సంవత్సరాలు రైతుల కష్టాలను పట్టించుకోలేకపోవడం బాధాకర విషయమని అన్నారు.

రెండు మండలాలకు రైతులకు మేలు జరిగే విధంగా అడ్డాకుల మండల కేంద్రంలో నూతన మార్కెట్ యాడును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతోద్వారా పంట నిల్వ, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి,  మార్కెట్ల నిర్మాణం, నూతన మార్కెట్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు  కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ దశరథ్ రెడ్డి, విజయ్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శేఖర్ రెడ్డి, వేగనాథ్, జగదీశ్ చారి, తదిరులు పాల్గొన్నారు.