27 May, 2026 | 3:24 AM

పచ్చి రొట్ట ఎరువులతో రైతులకు ఎంతో మేలు

27-05-2026 01:55 AM

పీఏసీఎస్ చైర్మన్  శివకుమార్ 

కొడంగల్, మే 26(విజయక్రాంతి ): పచ్చి రొట్ట ఎరువులతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని  పీఏసీఎస్  చైర్మన్ శివకుమార్ అన్నారు. కొడంగల్ పట్టణంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రంలో  మంగళవారం  వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో చైర్మన్ శివకుమార్  రైతులకు  పచ్చి రొట్ట ఎరువులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ..రైతులకు పంట సాగులో పచ్చి రొట్ట ఎరువులు ఎంతో లాభదాయం కల్గిస్తాయని అన్నారు. రైతులు పచ్చి ఎరువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత, మండల ఏఓ లు  మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.