27 May, 2026 | 3:23 AM

విద్యుదాఘాతంతో మేకలు మృతి

27-05-2026 01:55 AM

నిరుపేద కుటుంబానికి రూ.30 వేల నష్టం

వెంకటాపూర్, మే 26 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో వి ద్యుత్ షాక్తో రెండు మేకలు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పత్రి సారంగపాణికి చెందిన మేకలను ఉదయం మేతకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గ్రామస్తులు, మేకల యజమాని తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులోని ట్రా న్స్‌ఫార్మర్ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి అనుసంధానించిన ఎర్త్ వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో మేకలు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో సారంగపాణికి సుమారు రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సారంగపాణిని ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.