అనురాగ్‌లో డ్రైవర్ల కోసం ‘సడక్ సురక్ష’ పై అవగాహన
ఘట్ కేసర్, మే 26 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయo ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్-3, హీరో మోటోకార్ప్ సహకారంతో సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులు, రోడ్డు భద్రతా అవగాహనను ప్రోత్సహించేందుకు, విశ్వవిద్యాలయం డ్రైవర్లందరి కోసం ‘సడక్ సురక్ష‘ (రోడ్డు భద్రతా అవగాహన) కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీన్-ఎస్‌ఓఈ, డాక్టర్ వి. విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించబడింది.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదిక్ సాగర్, ట్రాఫిక్ నియమాలు, రక్షణాత్మక డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాద నివారణ చర్యలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రాముఖ్యతపై విజ్ఞానదాయకమైన ప్రసంగం చేశారు. డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు క్రమశిక్షణ అవగాహన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, సోషల్ లెర్నింగ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లేష్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 ప్రోగ్రామ్ ఆఫీసర్ పురుషోత్తం తీగల, ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనర్ విద్యా సాగర్లతో కలిసి సమన్వయం చేశారు.






