10న గన్ పార్క్ వద్ద గ్రేట్ మిలియన్ మార్చ్ డే
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి
ముషీరాబాద్, మార్చి 7 విజయక్రాంతి): చలో గన్ పార్క్ పేరిట ఈ నెల 10న తెలంగాణ అమరవీరులను స్మరించుకుందాం, తెలంగాణ హక్కుల దినంగా పాటిద్దాం, ఉద్యమ ఆకాంక్షలను సాధించకుందాం అనే నినాదంతో ’గ్రేట్ మిలియన్ మార్చ్ డే’ను నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ(టీయూజేఏసీ) వెల్లడించింది.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిలియన్ మార్చ్ కు సంబంధించిన గోడ పత్రికను టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.10న తేదీన జరిగే మిలియన్ మార్చ్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పాదయాత్ర ద్వారా గన్ పార్క్ చేరుకుంటారని తెలిపారు.
ఉద్యమకారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు అనేక మంది పాల్గొన్నారని చెప్పారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను, మలిదశ ఉద్య మంలో అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను, ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తిం చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కె.చంద్రశేఖర్ ప్రసాద్, ఉద్యమ నేతలు దయానందరావు, మంచాల వెంకటస్వామి, షేక్ షావలి, గుండా యాదగిరి, గోగిరాల నుధాకర్, ఎం.డీ.ఎక్ బాల్, వేముల యాదగిరి, జానకి రెడ్డి, ధనలక్ష్మి, నదానందం, గోగిరాల తదితరులు పాల్గొన్నారు.




