హోర్డింగుల దందాకు చెక్
- నగరంలో కొత్త అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ
- ప్రకటనల విధానంపై కొత్త జీవో
- నిబంధనలు ఉల్లంఘిస్తే మూడింతల ఫైన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వెలుస్తున్న భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల దందాకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నగర సౌందర్యాన్ని కాపాడటంతో పాటు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవుట్‌డోర్ ప్రకటనల విధానం లో సమూల ప్రక్షాళన చేపట్టింది.
ఈ మే రకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీఓ 84ను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ సీఎంసీ, మల్కాజిగిరి ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం నగరంలో ప్రకటనల ఏర్పాటును క్రమబద్ధీకరించేందుకు ప్రాంతాలను, ట్రాఫిక్ రద్దీని, వాణిజ్య ప్రాధాన్యతను బట్టి మహానగరాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ జిల్లాలు, ప్రధాన రవాణా మార్గా లు, ప్రీమియం నివాస ప్రాంతాలను జోన్-ఎస్ దకు తెచ్చారు.
కొత్తగా అభివృద్ధి చెందు తున్న కమర్షియల్ ప్రాంతాలను జోన్ ఏ గా, నివాస, రిటైల్ దుకాణాలు కలిసిన ప్రాం తాలను జోన్ బీ సాధారణ నివాస ప్రాంతాలను జోన్ సీ వర్గీకరించారు. ప్రకటనల ఫీజు ను కూడా ఈ జోన్ల ఆధారంగానే వసూ లు చేయనున్నారు. బేస్ ఫీజుకు జోన్ ప్రీమి యం, ఇల్యూమినేషన్ లైటింగ్ ప్రీమియంను గుణించి ఫీజును ఖరారు చేస్తారు. జోన్‌కు అత్యధికంగా 1.5 రేటును, జోన్‌కు అత్యల్పం గా 0.70 రేటును ఫ్యాక్టర్గా నిర్ణయించారు.
మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటన బోర్డులు పెట్టడానికి వీల్లే దు. ప్రకటనల అనుమతులు, పర్యవేక్షణ, జోనింగ్ ప్లాన్ ఆమోదం కోసం ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా అడ్వర్టెజ్మైంట్ రెగ్యులేటరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లతో పాటు ట్రాఫిక్ పోలీస్, హెచ్‌ఎండీఏ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటా రు. ఏఆర్సీ అనుమతి ఉంటేనే పబ్లిక్ స్థలాల్లో హోర్డింగ్లకు అవకాశం ఉంటుంది. పీపీపీ పద్ధతిలో వేలం ద్వారా 5 నుంచి 15 ఏళ్ల వర కు అనుమతులు ఇస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ప్రైవేట్ ప్రాపర్టీలపై స్వీయ ప్రకటనలు, వాహనాలపై యా డ్స్, తాత్కాలిక ప్రకటనల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి యాడ్ స్పేస్లో కచ్చితంగా 10 శాతం స్థలాన్ని లేదా సమయాన్ని ప్రభుత్వ, సామాజిక సందేశాలకు కేటాయించాలన్న నిబంధనను కొత్త జీవోలో తప్పనిసరి చేశారు. సోలార్ పవర్ పనిచేసే ప్రకటనలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రో త్సాహకాలు అందించనుంది.
ఎల్‌ఈడీ, ఎల్సీడీ డిజిటల్ స్క్రీన్ల వినియోగంపై ప్రభు త్వం కఠిన ఆంక్షలు విధించింది. వీటి గరిష్ట పరిమాణం 18 చదరపు మీటర్లకు మించకూడదు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లకు 50 మీటర్ల లోపల వాహనదారుల దృష్టి మరల్చేలా ఎలాంటి వీడియో కంటెంట్ ప్రదర్శిం చకూడదని స్పష్టం చేసింది. రాత్రి 11 గంటల తర్వాత ఈ డిజిటల్ స్క్రీన్లను కచ్చితంగా ఆఫ్ చేయాల్సిందే. పురావస్తు, చారిత్రక కట్టడా లు, విగ్రహాలు, పార్కులు, నీటి వనరులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, స్మశాన వాటికల వద్ద ప్రకటనలు ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
రోడ్డు మధ్యలో కియోస్కులు, భా రీ గ్యాంట్రీలు, గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లను కఠినంగా నిషేధించారు. అమలులో పారదర్శకత కోసం ప్రతి ప్రకటనకు క్యూఆర్ కోడ్ జియో ట్యాగింగ్ తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడింతల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే తప్పు రిపీట్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాగే ప్రకటన ఫీజు చెల్లింపులో 30 రోజులకు పైగా జాప్యం జరిగితే, అనుమతిని తక్షణమే రద్దు చేస్తారు.




