అంగన్‌వాడీ ఆవరణలో సమాదులు
- స్కూల్ వెళ్లడానికి జంకుతున్న పిల్లలు
- పరిష్కారం కోరుతున్న తల్లిదండ్రులు
చందుర్తి, ఆగష్టు16, (విజయక్రాంతి )మండల కేంద్రంలోని గొల్లవాడ అంగన్వాడీ పాఠశాలకు చదువు కోసం పిల్లలు రావడానికి జంకుతున్నారు, పిల్లలు పాఠశాలకు ఎందుకు వెళ్లలేక పోతున్నారు అని తల్లిదండ్రులను అరా తీస్తే, ఆ గొల్లవాడ పాఠశాలలో సమాధులు కాంపౌండ్ లోపల ఉండటం వల్ల విద్యార్థులు ఆ స్కూల్ కి రావటం లేదని తెలిసింది, ఇదే భయంతో గొల్లవాడ ప్రైమరీ స్కూల్ లో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం దీనికి నిదర్శనం.
పిల్లలు ఆ సమాధులను చూసి భయభ్రాంతులకు గురవుతూ, అందుకే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణమని తెలుస్తుంది. పాఠశాల నిర్మాణంలో ఆ సమాధులు కనిపించలేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.అధికారులు ఈ విషయమై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.






