3 June, 2026 | 3:28 AM

ఘనంగా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం

03-06-2026 01:39 AM

ఖైరతాబాద్,జూన్ 2(విజయక్రాంతి):ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారా హిల్స్, వెంకటేశ్వర డివిజన్ల బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ సంబంధిత సన్నాహక సమావేశం తెలంగాణ భవన్లో ఘనంగా జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సంస్థాగతంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న ఆదరణను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని కార్యకర్తలకు గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఈ సన్నాహక సమావేశంలో ఖైరతాబాద్ నియోజకవర్గ మెంబర్షి ప్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్, ముఖ్య నాయకులు శ్రీనివాస్ నాయుడు, రావుల విజయ్, రామ్చందర్, శ్రీకాంత్లతో పాటు డివిజన్ల ఉద్యమకారులు, బూత్ ఏజెంట్లు, సీనియర్ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.