3 June, 2026 | 4:07 AM

అర్హులైన ప్రతిపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు

03-06-2026 01:39 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ 

తాడ్వాయి, జూన్, 2 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్మోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామానికి చెందిన వడ్ల వైష్ణవి, పులి రాజమణి, ఎలుక లక్ష్మి లు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేశారు.

మంగళవారం మండలంలోని సంగోజువాడి గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకున్న పేదల కళ్ళల్లో  ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు. ఒకేరోజు 700 పైగా గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, నాయకులు వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి,, అంబీర్ శ్యాం రావు, రాజేశ్వర్ రెడ్డి, మేకల రాజు  పాల్గొన్నారు.