గౌడ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
ఆళ్ళపల్లి, మార్చి 16, (విజయక్రాంతి) : కంఠమహేశ్వర స్వామి సురమాంబ కళ్యాణాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామివారి కల్యాణాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు గౌరీశెట్టి శ్రీనివాసరావు, రేసు ఎల్లయ్య, మహమ్మద్ అతహర్.
ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజల తండోపతండాలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ కుల పెద్ద శ్రీరాం సమ్మయ్య ఆలయ కమిటీ చైర్మన్ కోరుకొప్పుల రాజన్న సారకల్లు గౌడ్ పానుగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గౌడ కుల దైవమైన కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి విగ్రహాలను ఎల్లమ్మ ఆలయంలో ప్రతిష్టించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు
అనంతరం ఎల్లమ్మ తల్లిక మండల ప్రజలంతా బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు దీకొండ మల్లేష్ బుర్ర వెంకన్న రేసు సూరిబాబు తెలగాని పురుషోత్తం రేసు రాము తిరుమలేష్ చంద్రబాబు శ్రీరామ్ సంపత్ సతీష్ మంద సాయిరాజ్ కార్తీక్ రేసు రాము తిరుమలేష్ గణేష్ లక్ష్మణ్ రెడ్డి మల్ల సమ్మయ్య రాజు నరేష్ తెలగాని సందీప్ దుర్గేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు




